ప్రజాశక్తి- కొత్తవలస: అనుమానం ఉన్న అందరికీ కేన్సర్ పరీక్షలు చేస్తామని వియ్యంపేట పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం ప్రపంచ కేన్సర్ దినోత్సవం అవగాహన ర్యాలీ చేపట్టారు. సర్పంచ్ పులిబంటి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని ఉద్దేశించి వైద్యులు మాట్లాడుతూ కేన్సర్‌పై అవగాహన పెంచుకుని ఆరోగ్య కరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిం చాలన్నారు. ఆహారపు అలవాట్లు, జంక్‌ఫుడ్స్ తినకుండా ఉండడం, ప్లాస్టిక్ వాడకం తగ్గడం, పొగాకు ఉత్పత్తులు తగ్గించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చునని అన్నారు. ముందస్తు పరీక్షలు చేసి కేన్సర్ నుంచి రక్షణ పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఇఒ నరసింహారావు, పిహెచ్‌ఎన్ జగదాంబ, హెచ్‌వి పద్మావతి, ఫార్మసిస్ట్ ఆశ జ్యోతి, యుడిసి సురేష్, హెల్త్ అసిస్టెంట్ సత్యా రావు, ఎల్‌టి సంతోష్, ఎమ్‌ఎల్‌హెచ్‌పిలు, ఏఎన్‌ఏమ్స్, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.బొబ్బిలి: కేన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సిహెచ్‌సి సూపరింటెండెంట్ గేదెల శశిభూషణరావు కోరారు. ఆసుపత్రిలో మంగళవారం కేన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో ఏ అవయవానికైన కేన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు కేన్సర్ నిర్దారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. రోడ్డు పక్కన షాపులు, హోటల్స్, రెస్టారెంట్లలో భోజనాలు, తినుబండారాలు తినడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, బయట ఫుడ్ తగ్గించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజలు పాల్గొన్నారు.
