క్రికెట్‌ బెట్టింగ్‌పై కేసు నమోదు

Apr 14,2025 21:13

ప్రజాశక్తి-విజయనగరంకోట : నగరంలోని ఫైర్‌ స్టేషన్‌ పక్కన ఉల్లి వీధి వద్ద క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనిపైన కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సిఐ శ్రీనివాస్‌ తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఉల్లివీధికి చెందిన బూర్లి వాసు(43)తో పాటు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న మరి కొంతమీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిలో శేఖర్‌ (శ్రీకాకుళం), యడ్ల శ్రీను, అప్పలరాజు (ఆనందపురం), నారాయణరావు, ఓబులరెడ్డి, గోల్డు శ్రీను (విజయనగరం) ఉన్నారని తెలిపారు.

➡️