చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాల్సిందే

Sep 28,2024 21:04

ప్రజాశక్తి – యంత్రాంగం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలని దెబ్బ తీసిన చంద్రబాబు నాయుడి పాపాన్ని ప్రక్షాళన చేయాలని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. చీపురుపల్లి వేంకటేశ్వర ఆలయంలో పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. బొబ్బిలి స్వామివారి వీధిలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలతో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు పూజలు చేశారు. డెంకాడ మండలంలోని చింతలవలస వద్ద ఉన్న వెంకటేశ్వర దేవాలయంలో మాజీ ఎంపి బెల్లాన, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు ఆధ్వర్యంలో పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. గజపతినగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రత్యేక పూజలు చేశారు.

➡️