తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌కు అభినందన

Nov 29,2024 21:49

ప్రజాశక్తి-విజయనగరం : తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్విని సౌత్‌ ఇండియా కాపు అసోషియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వెల్పూరి శ్రీనివాసరావు అభినందించారు. ఈ మేరకు విజయనగరంలోని యశస్విని ఆమె నివాసంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పుకాపు సామాజిక తరగతి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసినాయుడు, జనసేన ఎస్‌.కోట నియోజకవర్గ ఇన్‌ఛార్జి వబ్బిన సత్యనారాయణ, నాయకులు చంటి, సురేష్‌ రాజు, చిన్ని, మల్లువలస శ్రీను, పులిబంటి సంతోష్‌ పాల్గొన్నారు.

➡️