జెఎన్‌టియు రోడ్డు విస్తరణకు సహకరించండి

Nov 30,2024 21:59

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జెఎన్‌టియు జంక్షన్‌ నుంచి కళాశాల వరకు 80 అడుగుల రోడ్డు విస్తరణకు సహకరించాలని విఎంఆర్‌డిఎ ప్రణాళికా విభాగాధికారి కె.వెంకటేశ్వరరావు.. నిర్వాసితులను కోరారు. శనివారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వాసితులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ 37 మంది ఆస్తుల విషయంలో టిడిఆర్‌ రూపంలో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. అనంతరం నిర్వాసితుల అభిప్రాయాలను సేకరించారు. సదస్సులో విఎంఆర్‌డిఎ ప్రణాళిక అధికారులు పి.నాయుడు, బి.నిర్మల, టౌన్‌ సర్వేయర్‌ సింహాచలం, మండల సర్వేయర్‌ అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️