ప్రజాశక్తి- రేగిడి: గ్రామ సమైక్య సభ్యులు ఖరీఫ్ వ్యవసాయానికి వ్యవసాయ క్షేత్రాల్లో సాగు విస్తరణ, పంట వివరాలు సర్వే తప్పక చేయాలని ఎపి సిఎన్‌ఎఫ్ సంస్థ అడిషనల్, విజయనగరం జిల్లా డిపిఎం, ఎపి స్వామి నాయుడు, పిఇఐసిటి గుంటూరుకు చెందిన కృష్ణ ప్రసాద్ అన్నారు. మండల కేంద్రం డిఆర్‌డిఎ వెలుగు కార్యాలయంలో బుధవారం గ్రామ సంఘాల సభ్యులు, సీసీలు, ఎంఎంఎస్ సంఘం ప్రతినిధులతో యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సంఘాల సభ్యులు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సర్వే, పిఎండిఎస్ కిట్లు శత శాతం పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో సాగు విస్తరణ, పంట వివరాలు ముందుగా సర్వే చేయాలన్నారు. ప్రతి రైతును కలసి పంట పొలాల్లో వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, యాజమాన్య పద్ధతులపై రైతులకు వ్యవసాయ అసిస్టెంట్లతో పంటల దిగుబడిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సర్వే వివరాలు గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఋతుపవనాలు రాకముందు వేసే పంటలు, వాటి ప్రయోజనాలు రైతులకు వివరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీరితోపాటు ఎపిఎం బాసిన గోవిందరావు, ఎన్‌ఎస్‌ఎంటి పద్మ, కోఆర్డినేటర్, సీసీలు తదితరులు పాల్గొన్నారు.నెల్లిమర్ల: ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతోందని ఎపి సిఎన్‌ఎఫ్ ఎడిఎ ప్రకాశరావు అన్నారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం పై వ్యవసాయ శాఖ, వెలుగు ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలతో కన్వెర్జెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎపి సిఎన్‌ఎఫ్ ఎడిఎ ప్రకాశరావు, ఆర్‌టిఒ హేమసుందర్ మాట్లాడుతూ విషపూరిత ఎరువులు వినియోగం వల్ల భూమి సారవంతం కోల్పోయి మానవాళి భయంకరమైన రోగాల బారిన పడుతున్నారన్నారు. నేల సారాన్ని, వ్యవసాయాన్ని రక్షించుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమన్నారు. దీనిలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించి నవ ధాన్యాల సాగుకుకి ముందుకు రావాలన్నారు. నేల సారవంతానికి పచ్చి రొట్ట విత్తనాలు, వానపాము సాగు చేయాలన్నారు. రైతుల్ని ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎఒ ఎం.పూర్ణిమ, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ బంగారమ్మ, ఎపిఎం లు ఎస్‌విడి సురేష్, ఎల్.పద్మ తదితరులు పాల్గొన్నారు.
