ప్రజాశక్తి – బొబ్బిలి : విద్యుత్ బిల్లులు తగ్గించి ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ మంగళవారం పాకివీధిలో విద్యుత్ బిల్లులు దగ్ధం చేసి మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని చెప్పిన చంద్రబాబు నేడు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జీలు భారం వేయడం అన్యాయమన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేసి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.లక్కవరపుకోట: విద్యుత్ ఛార్జీలను పెంచి, ట్రూ అఫ్ ఛార్జీలను రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ కమిటీ అధ్యక్షులు గాడి అప్పారావు, సిఐటియు మండల అధ్యక్షులు టి. వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహశీల్దార్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గాడి అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలపై ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారన్నారు. అనంతరం కరెంటు బిల్లులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, వినియోగదారులు చంద్రిక, రామారావు, శ్రావణి, కనక, రాజ్యలక్ష్మి, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస: స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడేలా పెంచారన్నారు. ప్రజలపై అధనంగా 1.40 లక్షల కోట్లు రూపాయలు భారం వేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జక్కాన రమణ, జక్కాన దేముడు, జక్కన సత్యనారాయణ, మహేష్, దావాల కన్నంనాయుడు పాల్గొన్నారు. శృంగవరపుకోట: విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో వైసిపి ప్రభుత్వం చేసిన తప్పే కూటమి ప్రభుత్వం చేస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మద్దిల రమణ అన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మంగళవారం పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిల రమణ మాట్లాడుతూ డిజిటల్ మీటర్లు ప్రజలకు భారమవుతాయన్నారు. ప్రజల జీవన స్థితిగతులను గుర్తించి విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గమ్మెల సన్యాసిరావు, తాడి చిన్నారావు, పాంగి నాగేశ్వరరావు, వంతల చిన్న తదితరులు పాల్గొన్నారు.పూసపాటిరేగ: విద్యుత్ బారాలను మోయలేకపోతున్నామంటూ పూసపాటిరేగ విద్యుత్ బాధితులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు బచ్చల సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన విద్యుత్ భారాలను తగ్గించాలని, దళితులతో పాటు ఇతర ఇళ్ళకు అత్యధికంగా విద్యుత్ బిల్లులు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ టొంపల సీతారాం, మందపాటి వాసు రాజు, మద్దతు తెలిపారు.విద్యుత్తు ఛార్జీలు, సెకీ ఒప్పందాల రద్దుకుగజపతినగరం, దత్తిరాజేరు : పెంచిన విద్యుత్తు ఛార్జీలను, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన పలుచోట్ల విద్యుత్తు బిల్లులను దగ్ధం చేశారు. దత్తి రాజేరు మండల కేంద్రంలో సిపిఎం నాయకులు జి.శ్రీనివాస్ ఆధ్వర్యాన విద్యుత్తు బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూఅప్,, సర్దుబాటు ఛార్జీలు పేర రూ.15 వేల కోట్ల విద్యుత్తు భారాలు మోపారని తెలిపారు. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమిన ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చిన తరువాత అధిక భారాలు వేయడం దుర్మార్గమని అన్నారు. అవినీతితో కూడిన సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని, పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, సురేష్, బి.వెంకటరమణ, రాము, సరోజినీ, గౌరీ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారుగజపతినగరం మండలం బంగారంపేట గ్రామంలో సిపిఎం నాయకులు తెరలాపు కృష్ణ ఆధ్వర్యంలో కరెంట్ బిల్లులు దగ్ధం చేశారు. కార్యక్రమంలో లక్ష్మణ, అచ్చియమ్మ, కె.రాము, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.మెంటాడ మండలం కె.లింగాలవలస,సవరవల్లిలో సిపిఎం నాయకులు టి.సోములు ఆధ్వర్యాన విద్యుత్తు బిల్లులను దహనం చేశారు.
