పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన డిఐజి

May 13,2024 22:31

పాలకొండ: డివిజన్‌ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్నికలను విశాఖ రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని సోమవారం సందర్శించారు. ఎన్నికల జరుగుతున్న తీరు తెన్నెలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ చంద్రమౌళితో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. పోలింగ్‌ జరిగిన తర్వాత కూడా ఎక్కడా ఎటువంటి అల్లరులు జరగకుండా చూడాలన్నారు. అలాంటి గ్రామాన్ని గుర్తించి బందోబస్తు చేయాలన్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ విశాఖ రేంజ్‌ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. చెదరుమొదరు సంఘటనలు తప్ప ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గంలో రెండు కేసులు, శ్రీకాకుళంలో ఒక్క కేసు ఎన్నికలకు సంబంధించి నమోదు చేశామని, వాటిని పరిశీలిస్తామని చెప్పారు.

➡️