ప్రజాశక్తి-విజయనగరంకోట : సిఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. బాధితులకు ఆదివారం అందజేశారు. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన వెల్దుర్తి సత్యానికి రూ.2.21 లక్షలు, గట్టుపల్లి గ్రామానికి చెందిన గుల్లిపల్లి నవ్య, నరేష్ దంపతులకు రూ.2.28 లక్షలు చెక్కులను మంత్రి అందించారు.