ప్రజాశక్తి-వేపాడ : వేపాడ మండలంజాకేరు గ్రామమునకు చెందిన తముడు పెద్దుకు అనకాపల్లి వాస్తవ్యులు, బోనాల నాగేశ్వరరావు లలిత దంపతులు జాకీర్ గ్రామంలో గల సింహాద్రి అప్పన్న సేవ గరిడితముడు పెద్దుకు ఒక కేజీ వెండి, ఎద్దు కొమ్ములకు తగిలించే అలుసులు తయారు చేసి వితరణగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి సేవాభావం కలిగిన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని గ్రామ సర్పంచ్ బుద్ధ చిన్నమ్మలు గ్రామ పెద్ద అప్పలనాయుడుతో పాటు గ్రామ ప్రజలు బోనాల నాగేశ్వరరావు, కుటుంబం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుని కోరారు.
