పారా క్రీడలకు జిల్లా క్రీడాకారులు

Feb 16,2025 21:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 17 నుంచి 20 వరకు చెన్నైలో జరిగే 23వ పారా జాతీయ స్థాయి ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు ఆదివారం జిల్లా క్రీడాకారులు బయల్దేరి వెళ్లారు. వీరికి పారా జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్‌ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటి, జిల్లా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 2న మంగళగిరిలో జరిగిన పారా రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన సుంకరి దినేష్‌, దొగ్గా దేముడు నాయుడు, బోధల వాసంతి, కిల్లాక లలిత.. పరుగు 100 మీటర్లు, 400 మీటర్లు, షాట్‌ పుట్‌ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విషయం తెలిసిందే.

➡️