పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు

Jun 10,2024 19:12

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : విశాఖపట్నంలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. 83 కిలోల విభాగంలో ఎస్‌.రామకృష్ణ బంగారు పతాకం సాధించాడు. జిల్లా పరిషత్తు కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా రామకృష్ణ పనిచేస్తున్నాడు. ఎస్‌.రాజా 64 కేటగిరీలో 2 బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించాడు. కె.జగదీష్‌ 59 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు.

➡️