ప్రజాశక్తి-వేపాడ : గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తనివ్వొద్దని మండల ప్రత్యేకాధికారి లకీëనారాయణ.. అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా గ్రామాల్లో శనివారం గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో తహశీల్దార్ జె.రాములమ్మ, ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ దేవి, ఎంఇఒ పి.బాల భాస్కరరావు, పిఆర్ జెఇ ఆలీ, ఎఒ యశ్వంత్, ఎపిఎం తదితరులు పాల్గొన్నారు,
