రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి

Oct 28,2024 21:38

విజయనగరంకోట, బొబ్బిలి: పోలీసు అమరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోను, బొబ్బిలి, చీపురుపల్లి కేంద్రంలోనూ రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 313 యూనిట్ల రక్తం సేకరించి రక్త నిధి కేంద్రాలకు అందజేశారు. పోలీసు పరేడ్‌ గ్రౌండులో రోటరీ బ్లండ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరాన్ని ఎస్‌పి వకుల్‌జిందాల్‌ ప్రారంభించారు. అనంతంర ఆయన మాట్లాడుతూ రక్త దానంతో ఇతరులకు ప్రాణ దానం చేసినట్లేనన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను, రక్త హీనత కారణంగా ఇబ్బందులకు గురువుతున్న ప్రజల అవసరాలను దష్టిలో పెట్టుకొని, వారికి రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఆర్మ్‌డ్‌ రిజర్వు, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, ఎన్‌సిసి క్యాడెట్స్‌ పాల్గొని రక్తదానం చేసారు. వీరిని ఎస్‌పి అభినందించి రోటరీ క్లబ్‌ తరుపున సర్టిఫికేట్లు అందజేశారు.పిటిసి ఆధ్వర్యాన రక్తదానంరక్త దాతలు ప్రాణదాతలని పిటిసి ప్రిన్సిపల్‌ డిఆర్‌సి రాజు అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ పివి అప్పారావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 53మంది రక్తదానం చేశారు. కార్యక్రమములో డిఎస్‌పిలు టి.రమేష్‌, సిఐలు, ఆర్‌ఐలు, యస్‌ఐలు, ఆర్‌యస్‌ఐలు, పిటిసి. అవుడోర్‌ సిబ్బంది, మినిస్టీరియల్‌ సిబ్బంది, అవుట్‌ సోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాతలే ప్రాణదాతలు రక్తదాతలే ప్రాణదాతలని బొబ్బిలి డిఎస్‌పి పి.శ్రీనివాసరావు అన్నారు. పోలీస్‌ అమరుల వారోత్సవాల్లో భాగంగా పట్టణ పోలీస్‌ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం కొరతతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రక్తం కొరతను నివారించేందుకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలూ రావని తెలిపారు. రక్తదానం చేసిన యువకులు, పోలీసు సిబ్బందిని అభినందించారు. 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో పట్టణ సిఐ కె.సతీష్‌ కుమార్‌, ఎస్‌ఐలు జ్ఞానప్రసాద్‌, రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️