వృద్ధులకు భోజన, వస్త్ర, ఫలదానం 

May 25,2024 14:23 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట : వయోవృద్ధులకు భోజన వస్త్ర ఫలదానాన్ని భగ్గం బాల నాగేశ్వరరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగేశ్వరరావు సతీమణి పార్వతి కుటుంబ సభ్యులు వితరణ చేయడం జరిగింది. శనివారం నాడు స్థానిక అంబటి వలస, రీమా పేట, ఉమామహేశ్వరి నగర్ నందు నిర్వహించబడుతున్న శ్రీ వెంకట సాయి వయో వృద్ధాశ్రమంలో ఉంటున్న 25 మంది వృద్ధులకు ఒక రోజు నిమిత్తం భోజనం వస్త్రాలు, ఫలాలు కుటుంబ సభ్యులు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు సతీమణి పార్వతి మాట్లాడుతూ నాగేశ్వరరావు మూడవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఇటువంటి వృద్ధులకు సేవలు చేయడం వలన మనల్ని చూసి మరి కొంతమంది ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటువంటి వారికి భోజనం పెట్టడం వలన వేలకోట్లు ఖర్చు అవ్వువు , మనకున్న దానిలో ఎంతో కొంత వృద్ధులను ఆదుకుంటే సమాజ సేవ చేసినట్లు అవుతుందన్నారు. ఈ ఆశ్రమంలో ఆయాలు, నర్సులు, వంట మనుషులు రాత్రి పగలు వయోవృద్ధులకు సేవలు అందిస్తునమని వృద్ధాశ్రమం నిర్వాహకులు కట్టమూరి ఆంజనేయులు, అనురాధ తెలపడం జరిగింది.

➡️