కారి గొల్లపేటలో తాగునీటి ఇబ్బందులు

Nov 5,2024 20:41

ప్రజాశక్తి – భోగాపురం : భోగాపురం పంచాయతీ పరిధిలోని కారి గొల్లపేట గ్రామంలో గత 20 రోజుల నుంచి తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని యువకులు చెబుతున్నారు. వ్యవసాయ బోర్లు తోపాటు పక్క గ్రామమైన కొయ్యపేట వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆ గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు మంగళవారం పంచాయతీ కార్యాల యంతో పాటు మండల పరిషత్‌ కార్యాల యానికి వచ్చి ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీకి చెప్పినప్పటికీ సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరుపై ఆధారపడే వాళ్ళమని ఇప్పుడు ఆ బోరు కూడా మరమ్మతులకు గురైనట్లు వివరించారు. కుళాయిలు మరమ్మతులకు గురై 20 రోజులు గడిచినప్పటికీ కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ చిన్నారావుకు సమస్యను వివరించడంతో అధికారులు దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన తెలిపారు.

➡️