బాధ్యతలు స్వీకరించిన డిఎస్‌పి

Apr 14,2025 21:22

ప్రజాశక్తి-విజయనగరంకోట : విజయనగరం మహిళా పోలీసుస్టేషను డిఎస్‌పిగా ఆర్‌.గోవిందరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేసారు. ఈ సందర్భంగా ఎస్‌పి డిఎస్‌పిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు.

➡️