నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ లపై వైసిపి డిమాండ్
ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇస్తామన్నా మూడు వెలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, విద్యార్దులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. యువత పోరు కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక కంటోన్మెంట్ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు సంబంగి చిన అప్పలనాయుడు, కడుబండి.శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. ప్రకటించిన పథకాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రజలు మనోభావాలతో తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందనీ, ఆడాదం ఆంధ్ర లో అవకతవకలు జరిగాయని ప్రజలు ఆలోచనను పక్కత్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అమ్మవడి లేదు, ఉచిత బస్సు లేదు,15 ఏళ్ల దాటిన మహిళలకు ఇస్తామన్నా 1500 అన్నారు అదీ లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్దులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం జిమ్మిక్కులు చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. హామీలు కొండలు దాటాయి చేతలు గడప దాటలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్దులకు నిలబడింది వైఎస్ రాజశేఖర రెడ్డి, తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడం లో నిర్లక్ష్యం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై ప్రజల్లో సంతృప్తి పెరిగిందని రానున్న కాలంలో ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ 4వేలు కోట్లు విద్యార్దులు ఫీజులు కోసం, యువత కు ఇవ్వాల్సిన 3 వేలు నిరుద్యోగ భృతి సాధన కోసం ప్రజలు మేడలు వంచి సాధించడం కోసం జరిగే పోరాటంలో ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ధర్నా లో మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, రాజాం నియోజకవర్గ నాయకులు రాజేష్,పార్టీ నాయకులు,అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు యువత పాల్గొన్నారు.
