ప్రజాశక్తి- కొత్తవలస : జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద శుక్రవారం గనిశెట్టి పాలెంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం, లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది పాడి రైతులకు సంబంధించిన 47 పశువులకు గర్భకోశ వ్యాధులకు, 12 పశువులకు సాధారణ వ్యాధులకు చికిత్సలు అందించి ఉచితంగా మందులు పంపణీ చేశారు. లేగదూడ ప్రదర్శనలో 43 మంది పాడిరైతులు వారి వారి లేగ దూడలను తీసుకుని రాగా, అందులో ఆరోగ్యంగా ఉన్న లేగదూడలను గుర్తించి మొదటి, రెండు, మూడు బహుమతులను ఇచ్చి, పాల్గొన్న అందరు రైతులకు ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం సంయుక్త సంచాలకులు మండలంలోని కొత్తవలస, మిందివలస, రామచంద్రాపురం, గనిశెట్టి పాలెం గ్రామాలలో జరుగుతున్న పశుగణన కార్యక్ర మాన్ని బ్రూసెల్లా వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జామి ఈశ్వరరావు, ఉప సర్పంచ్ జామి కొండలరావు, టిడిపి నాయకులు సూరిబాబు, జిల్లా సంయుక్త సంచాలకులు, పశుసంవర్థ్ధక శాఖ డాక్టర్ వైవి రమణ, జిలా పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రాధాకృష్ణ, కొత్తవలస సబ్ డివిజన్ సహాయ సంచాలకులు గంగాధర్, దెందేరు, లక్కవరపుకోట పశువైద్యులు డాక్టర్ ప్రదీప్ నాయుడు, డాక్టర్ గాయత్రి, మండలంలోని పశుసంవర్థక సహాయకులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.