ప్రజాశక్తి – కొత్తవలస : రాష్టాన్ని హరితంద్రప్రదేశ్‌గా తీర్చి దిద్దడానికి మనమంతా కృషి చేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపు నిచ్చారు. గురువారం లక్కవరవుకోటలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రైతులకు 10వేల మునగ మొక్కలను సరఫరా చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కల్ని నాటి పర్యావరణానికి ఊపిరి పోసి కాలుష్యాన్ని తరిమికొట్టాలన్నారు. నియోజకవర్గంలో గణనీయంగా పచ్చతనం, అటవీ విస్తీర్ణాలు పెంపుదల లక్ష్యంగా వన మహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. వివిధ రకాల అవసరాల పేరుతో చెట్లను విచ్చలవిడిగా కొట్టేయడంతో వాయు కాలుష్యం పెరిగిందని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్.కోట మాజీ జెడ్‌పిటిసి కరెడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపిపి కొల్లి రమణమూర్తి, సర్పంచ్ కెర్రు పార్వతి, పుట్టా శ్రీను, మల్ల రామకృష్ణ, జీఎస్‌నాయుడు, అధికారులు పాల్గొన్నారు.
