ఉత్సాహంగా పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌

Nov 29,2024 21:47

ప్రజాశక్తి-విజయనగరంకోట : స్థానిక జిల్లా పోలీసు మైదానంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజు శుక్రవారం విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్‌ డివిజన్లు, ఎఆర్‌, మినిస్టీరియల్‌ సిబ్బంది, హోంగార్డు విభాగాలకు చెందిన పోలీసు జట్లు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నాయి. పోలీసు అధికారులు, సిబ్బంది తమ హోదాలతో తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా వివిధ పోటీల్లో పాల్గొని, క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. కబడ్డీ, బాస్కెట్‌ బాల్‌, వాలీ బాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, త్రోబాల్‌, స్లో సైకిల్‌ రేస్‌, లెమెన్‌ అండ్‌ స్పూన్‌, మ్యూజికల్‌ చైర్‌తోపాటు అథ్లెటిక్స్‌లో 100, 400, 800 మీటర్లు పరుగు, రిలే పరుగు, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో, డిస్క్‌త్రో పోటీలను మహిళా, పురుషులకు వేర్వేరుగా నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను ఎఆర్‌ అదనపు ఎస్‌పి జి.నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రీడలు శనివారంతో ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎఆర్‌ డిఎస్‌పి యూనివర్స్‌, ఆర్‌ఐలు ఎస్‌.గోపాల నాయుడు, ఆర్‌.రమేష్‌ కుమార్‌, శ్రీనివాసరావు, సిఐ లక్ష్మణరావు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️