తప్పని ముప్పు

Jun 9,2024 11:54 #Vizianagaram

అధ్వానంగా కాలువ వ్యవస్థ
అమలకు నోచుకోని అండర్ గ్రౌండ్ కాలువ నిర్మాణం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర పాలక సంస్థ పరిధిలో మురుగు పారుదల వ్యవస్థ ఆస్తవ్య స్తంగా ఉంది. చెత్తాచెదారంతో నిండిన పరిస్థితి, మురుగు… కదలడు. వదలదు అన్న చందంగా పరిస్థితి తయారైంది. సాధారణంగా ఏటా వర్షాకాలం ముందే కాలువల్లో పూడిక తొలగించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో నగరంలో పూడిక తీత పనులు జరుగలేదు. ప్రధాన కాలువలు పూడికతో నిండి పోయినా ఆ దిశగా చర్యలు లేవు. దీంతో చిన్న పాటి వర్షం కురిసినా.. ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతు న్నాయి. రెండు సార్లు సాయంత్రం కురిసిన వర్షానికి మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాలు చెరువును తలపించే విధంగా నీరు నిండిపోవడంమే నిదర్సనం. పదేళ్ల క్రితం సిటీ స్టాండ్కు వెళ్లే వారిలో కర్రబడ్డీల వద్ద ఉన్న కాలువలో వరద ఉద్ధృతికి ఓ మహిళ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పటకీ ఆ కాలువపై పలకలు వేయలేదు. దీంతో అక్కడ ముప్పు పొంచి ఉంది. నగర పాలక సంస్థ కార్యాలయం సమీపంలో కాలువలతో పాటు గంటస్తంభం, పీడబ్ల్యు మార్కెట్, సిటీ స్టాండ్, లంక వీధి వద్ద కాపలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరద నీటి కాలువలు 100 మీటర్ల పరిధిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అన్నీ పూడికతో దర్శనమిస్తుయి. ట్యాంక్ బండ్ రోడ్లో ఎల్ ఐ సీ కార్యా యం వద్ద నుంచి నాయుడు కాలనీ, వినా కనగర్, పద్మావతినగర్ మీదుగా ధర్మ 10 వరకు 3కి.మీ పెద్దకాలువలు ఉన్నాయి. వర్షం కురిస్తే, సిటీ స్టాండ్ నగర పాలిక సంస్థ కార్యలయం, గంటస్తంభం, పార్కు గేటు కూడలి ముంపునకు గురవుతాయి. ధర్మపురి రింగ్ రోడ్డు ప్రాంతాలతో పాటు పలు | కాలనీల్లో ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి.నగరంలో మురుగు కాలువ. రోజుల తరబడి శుభ్రం చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో గ్యాంగ్ వర్కు ద్వారా పూడికతీత చేపట్టేవారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మరికొన్ని చోట్ల కాలువల్లో నాణ్యతాలోపాలు, వంకర టింకర కట్టడాలతో మురుగు ముందుకు వెళ్లకుండా రోడ్డెక్కుతున్న పరిస్థితులు. ఉన్నాయి. ఇక నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కలగానే మిగిలింది. ఇది కేవలం డిపీఆర్ తయారు. వరకు పరిమితమైంది తప్ప ఆచరణకునోచుకోలేదు.కాలువ వ్యవస్థ మెరుగు కోసం శాశ్వత పరిష్కారం దిశగా, భూ గర్భ కాలువ వ్యవస్థ నిర్మాణం జరిగితే తప్ప పరిష్కారం లభించదు.అధి ఎప్పటికీ అవుతుందో పాలకులు చెప్పాలి ఉంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ పాలకులు దృష్టి పెడతారో లేదో వేచి చూడాల్సిందే.

➡️