అగ్ని ప్రమాద బాధితుడికి ఆర్థిక సహాయం

Jan 11,2025 20:48

ప్రజాశక్తి-బొబ్బిలి : బాడంగి మండలం వాడాడలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధితుడు వి.సన్యాసికి ఎమ్మెల్యే బేబినాయన ఆర్థిక సహాయం చేశారు. కోటలో శనివారం బాధితుడికి నగదు, దుప్పట్లు, నిత్యావసర సరుకులను అందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బేబినాయన అన్నారు.సిఎం సహాయ నిధి చెక్కు అందజేతఅనారోగ్యంతో బాధపడుతున్న కోమటిపల్లి గ్రామానికి చెందిన బోనెల జయలక్ష్మికి ఎమ్మెల్యే బేబినాయన సిఎం సహాయనిధి చెక్కు అందజేశారు. కొన్ని రోజులుగా జయలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వైద్యానికి రూ.80 వేలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️