జిఒ 117ను రద్దు చేయాలి

Jun 11,2024 21:22

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉపాధ్యాయుల సమస్య వెంటనే పరిష్కరించాలని, మూడు, నాలుగు, ఐదు తరగతుల విలీనం ఆపి, జిఒ 117 రద్దు చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం నిర్వహించిన ఎపిటిఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1998, 2008 ఎంటిఎస్‌ ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. కెజిబివిలకు ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షులు షేక్‌ బుకారిబాబు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని కోరారు. అమ్మఒడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలతేరు శ్రీనివాస్‌ మాట్లాడుతూ మెగా డిఎస్‌సి ప్రకటించాలని, ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్లు ఉపాధ్యాయులకు ఇవ్వాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న నాడు- నేడు పనులు ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు బంకురు జోగినాయుడు, సిహెచ్‌. కోటేశ్వరరావు, కె.శ్రీనివాసన్‌, జక్కు శివాజీ , కర్రి రవి, ఎం.వి.రమణ, వై.సీతం నాయుడు, లంక రామకష్ణ, జివివి ప్రసాద్‌ కర్రాసింహాచలం పాల్గొన్నారు

➡️