ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38 వ జాతీయ నేషనల్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో జిల్లాకు చెందిన ఎస్.పల్లవి 71 కేజీల కేటగిరిలో 212 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించింది. పల్లవికి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ కార్యదర్శి, కోచ్ చల్లా రాము, జిల్లా ఒలింపిక్ అషోషియేషన్ నాయకులు అభినందనలు తెలిపారు.
