ప్రజాశక్తి – కొత్తవలస: గత నెల 27, 28, 29 తేదీలలో మలేషియాలో జరిగిన, మలేషియా ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో భారతదేశం తరఫున ములపర్తి ప్రకాష్‌రావు పోటీలో పాల్గొని దేశానికి బంగారు పతకం సాధించాడు. మండలంలోని కంటకాపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ రావు ఇండియా తరుపున సీనియర్స్ వెయిట్ కేటగిరి అండర్ 80 కేజీలో పాల్గొని బంగారు పతకం సాధించాడు. మొదటి ఫైట్ మలేషియా క్రీడాకారుడుతో పోటీపడి విజయం సాధించి ఫ్రీ కోటర్ ఫైనల్‌కు ఎంట్రీ సాధించి ఫ్రీ కోటర్ ఫైనల్ లో సింగపూర్ క్రీడాకారుడుతో తలపడి విజయం సాధించి, సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్ క్రీడాకారుడుతో పోటీపడి విజయం సాధించి డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరుకున్నాడు.. ఫైనల్‌లో మలేషియా క్రీడాకారుడుతో పోటీపడి విజయం సాధించి పసిడి సొంతం చేసుకున్నాడు. ఈ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో 640 క్రీడాకారులు ఆల్ కేటగిరీస్‌లో పాల్గొన్నారు. ఈ విజయం పట్ల తన గురువు డాక్టర్ పాండ్రంగి రుక్మాకరరావు, స్పాన్సర్ చేసిన పెద్దలు విశాఖపట్నం 105 అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గోవర్నర్ దండెం పోలారరావు, తిరుపతి రాజు, ఉషారాణి, విశ్వేశ్వరరావు, డిఎల్‌కె.రావు, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రజాప్రతినిధులు, ఎఫ్.బి.సి.క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.