ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

  •  భారీగా రక్తం శిబిరం
  • మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చిన సర్వే డిపార్ట్మెంట్

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విజయనగరం టిడిపి కార్యాలయం అశోక్ బంగ్లా లో భారీగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, అదితి విజయలక్ష్మి గజపతిరాజు చెల్లి పూసపాటి విద్యావతి దేవి రక్తం రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టిడిపి పోలిట్బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఈ కార్యక్రమంలోని జిల్లా సర్వే యూనియన్ నాయకులు సర్వేలు ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు కు వినతిపత్రం అందించి వారి సమస్యలను వివరించారు. దీనికి స్పందించినవారు కలెక్టర్ , రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 41 కేజీల కేకను డెఫ్ & ఢం విద్యార్థులు సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ రక్తదాన శిబిరంలో ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లు, ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్లు రక్తం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, టౌన్, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు .

➡️