ప్రజాశక్తి-విలేకర్లు : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా అంతటా ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తవలస: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడుని ఎంపిడిఒ రమణయ్య అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి సిబ్బందితో రాజ్యాంగ పీఠికను చెప్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి ఎపిఒ, ఎంఇఒ, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. బొబ్బిలి: రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు జెసి రాజు కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం టిఆర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిఒక్కరికి సమానంగా న్యాయం అందేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఎస్ శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలచే రాజ్యాంగ ప్రతిజ్ఞబొబ్బిలిరూరల్ : రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన చట్టం గురించి ఉపాధి పనులు జేరిగే చోట ఎంపిడిఒ రవి కుమార్, ఎపిఒ లక్ష్మీపతిరాజులు వివరించి వారిచేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి కూలీలకు వివరించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ యం.శ్రీను, రాజ్యాంగ ప్రతిజ్ఞ సిబ్బంది, విద్యార్థులతో చేయించారు. రామభద్రపురం: రాజ్యాంగాన్ని గౌరవించడం దేశ ప్రజలందరి ఉమ్మడి బాధ్యతని రాజ్యాంగం పవిత్ర గ్రంధమని దాన్ని సంరక్షించటం, గౌరవించడం పాలకుల, ప్రజల కర్తవ్యమని కారుణ్యా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెసి రాజు తెలిపారు. మంగళవారం పాఠశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను విద్యార్థులు,ఉపాద్యాయులు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాద్యాయులు రవికుమార్ విద్యార్థులచే రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు రెడ్డి వేణు, కృష్ణంనాయుడు, వెంకట రమణ, బొప్పే రవికుమార్, కృష్ణ, సత్యం విద్యార్థులు పాల్గొన్నారు. శృంగవరపుకోట: పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవంతో పాటు సాంఘిక శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించినట్లు హెచ్‌ఎం బి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎస్‌ఎంసి చైర్మన్ లోతేటి ఈశ్వరరావు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో ఓటరు అక్షరాస్యత వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రంథాలయ అధికారి డి శ్రీధర్, వేదిక ప్రతినిధి ఆర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. పుణ్యగిరి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని శ్రీనివాస కాలనీలో గల సామాజిక భవనంలో నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గోవింద ప్రకాష్ శర్మ, ఉపాధ్యక్షుడు గనివాడ బాపు నాయుడు, కార్యదర్శి ముగ్గు ధర్మారావు, సహాయ కార్యదర్శి హనుమాల శెట్టి నానాజీ, స్థానికులు మట్ట వీరభద్రరావు, శ్రీనివాసరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.గరివిడి : స్థానిక అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం పైఅవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ మాట్లాడుతూ దేశంలో నివసించే అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమానత్వం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ, ఎఒ జి.అనిల్ కుమార్, వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.భోగాపురం: తహశీల్దార్ కార్యాలయం సమీపంలో బహుజన సమాజ్ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్షులు ఎరుకొండ వెంకటరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఉత్తరాంధ్ర మాల మహానాడు అధ్యక్షులు బి గోపాలరావు, న్యాయ ఉద్యమ వేదిక జిల్లా గంటానా అప్పారావు, న్యాయవాది పచ్చిపాల గుర్నాథరావు తదితరులు పాల్గొన్నారు. చెరుకుపల్లిలో గంట నర్సింగ్ రావు, నందిగాంలో ముక్కు గణపతిరావు, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఎం.సురేష్, మండల పరిషత్ కార్యాలయంలో పరిపాలన అధికారి కామేశ్వరరావు, ఇఒపిఆర్‌డి గాయత్రి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.డైట్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవంనెల్లిమర్ల: ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో 75వ రాజ్యాంగ దినోత్సవం మంగళవారం డైట్ ప్రిన్సిపాల్ జి. పగడాలమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ రాజేంద్రప్రసాద్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులార్పించారు. సాంఘిక శాస్త్రం అధ్యాపకులు మాతా రామకృష్ణ ఇచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. చాత్రో పాధ్యాయుల క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పలువురు జాతీయ నాయకుల వేశాధారణ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు పి.రవి కుమార్, స్టాఫ్ సెక్రటరీ డి. ఈశ్వర రావు పాల్గొన్నారు.మిమ్స్ మెడికల్ కళాశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మిమ్స్ యాజమాన్య ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.తెర్లాం: స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ విగ్రహానికి తహశీల్దార్ హేమంత్‌కుమార్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రాంబాబు, ఎంఇఒ త్రినాధరావు, ఎపిఒ సుశీల, విఆర్‌ఒలు, పంచాయతీ సెక్రెటరీ, తహశీల్దార్, ఎంపిడిఒ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రాజాం: స్థానికమండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపిడిఒ శ్రీనివాసరావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కృష్ణంరాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిటి రాజశేఖర్, పాల్గొన్నారు.కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో విజయనగరం టౌన్ : గిరిజన విశ్వవిద్యాలయమ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ తేజస్వి కట్టిమని, ముఖ్య అతిదిగా విచ్చేసిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పూర్వ వైస్‌ఛాన్సలర్ మహ్మద్ మియాన్ మన రాజ్యాంగ రూప శిల్పి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను అర్పించి రాజ్యాంగ ప్రవేశిక ను సామూహిక పఠనం చేయించారు సత్య డిగ్రీ కళాశాలలో సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్, వక్తత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం.శశి భూషణ రావు మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఎన్ సి సి ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్య వేణి, లెఫ్టినెంట్ ఎం. ఉదరు కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి.సూరపు నాయుడు తదితరులు పాల్గొన్నారు.రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నడుచుకోవాలి విజయనగరం కోట : భారత రాజ్యాంగాన్ని గౌరవించి అనుసరిస్తూ నడుచుకోవాలని నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మొయిద నారాయణరావు అన్నారు. నారాయణ పబ్లిక్ స్కూల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. రాజ్యాంగ విశిష్టతపై వ్యాసరచన, వకత్వ పోటీలను నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం విజయనగరం టౌన్ : దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో గంజిపేట అంబేద్కర్ మండపం వద్ద రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠిక ను దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు సభ్యులందరితో ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించడమే అసలైన దేశభక్తి అని తెలిపారు. దళిత రైట్స్ కన్వీనర్ పాండ్రంకి రమణ, గంజిపేట యువజన సంఘం సభ్యులు బూసర వరప్రసాద్, డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కోఆర్డినేటర్ వరలక్ష్మి, దళిత బహుజన శ్రామిక మహిళా కన్వీనర్ సత్యవతి పాల్గొన్నారు.గురజాడ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం విజయనగరం టౌన్ : రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గురజాడ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా న్యాయవాదులు గేదెల సత్యం, పి.చిట్టి బాబు, పివైఎస్ సాయి పవిత్ర హాజరై భారత రాజ్యాంగ గొప్పతనాన్ని వివరించారు. పాఠశాల డైరెక్టర్ ఎంవిజిఅర్ కృష్ణాజీ మాట్లాడుతూ రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు. అనంతరం జనరల్ నాలెడ్జి టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చూపిన 38 మంది విద్యార్థులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం. స్వరూప, హెచ్‌ఎం పూడి శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డెంకాడ: స్థానిక శాఖా గ్రంథాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని గ్రంథాలయాధికారి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సంతకవిటి: మండల పరిషత్ కార్యాలయంలో బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎంపిడిఒ సురేష్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి రఘునాథ చారి, ఎపిఒ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
మాజీ ఎమ్మెల్యే శంబంగి
బొబ్బిలి: రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలైతే రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి వైసిపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కన్వీనర్ శంబంగి వేణుగోపాలనాయుడు, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు చోడగంజి రమేష్ నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు ఉత్తరవల్లి అప్పలనాయుడు, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.వేపాడ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని స్థానిక మండల పరిషత్తు ఆవరణలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎంపిడిఒ సిహెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సత్యవంతుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, తహశీల్దార్ జె.రాములమ్మ, మండల స్థాయి అధికారులు, వెలుగు ఎపిఒ, ఎంఇఒ, సిబ్బంది పాల్గొన్నారు.