ఘనంగా గాంధీ జయంతి

Oct 2,2024 21:27

ప్రజాశక్తి- బొబ్బిలి : పట్టణంలోని మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌.కిరణ్‌ కుమార్‌ వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వనమిత్ర ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులను ఇందిరమ్మకాలనీలో సత్కరించి వారి సేవలను కొనియాడారు. గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పట్టణ సిఐ కె.సతీష్‌కుమార్‌, గాంధీ స్మారక నిధి అధ్యక్షులు ఎం.విజయమోహన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోర్టు, సబ్‌ జైల్లో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అరుణశ్రీ, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రోహిణిరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం.మురళి మోహన్‌ కుమార్‌, సభ్యులు గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.శృంగవరపుకోట: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పట్టణంలోని గాంధీ పార్క్‌ ఆవరణంలో గల గాంధీ విగ్రహానికి, బాపూజీ సేవా సంఘం వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి వబ్బిన సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు జిఎస్‌ నాయుడు, నాయకులు రెడ్డి వెంకన్న, కాపుగంటి వాసు, తదితరులు పాల్గొన్నారు. స్థానిక వివేకానంద విద్యాసంస్థలలో గాంధీ జయంతి సందర్భంగా డిగ్రీ విద్యార్థులు బుధవారం కళాశాలలో నిర్వహించిన సాంస్కృక ప్రదర్శనలు అందరినీ అలరించాయని కళాశాల కరస్పాండెంట్‌ సిహెచ్‌ఆర్‌కె ప్రసాద్‌ బుధవారం తెలిపారు. వస్త్రధారణకు సంబంధించిన ప్రాముఖ్యతను వివరించారు.బాడంగి: మండలంలోని ఎరుకుల పాకలు గ్రామంలో గాంధీ జయంతి సందర్బంగా ఎంపిటిసి పాలవలస గౌరు, సర్పంచ్‌ పార్వతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జామి: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ సతీష్‌ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. జామి బజారు సెంటర్‌లో గల విగ్రహానికి వైసిపి, టిడిపి నాయకులు పూల మాలలు వేసి, గాంధీ సేవలను మననం చేసుకున్నారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి శ్రీదేవి, సర్పంచ్‌ చిప్పాడ లక్ష్మి, మాజీ జెడ్‌ పిటిసి బండారు పెదబాబు పాల్గొన్నారు. డెంకాడ: స్థానిక మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి ఎంపిపి బంటుపల్లి వెంకట్‌ వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి ఎన్నింటి తమ్మునాయుడు, ఎంపిడిఒ డిడి స్వరూపరాణి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎపిఎస్‌పి బెటాలియన్‌ సిబ్బంది, డెంకాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్న విగ్రహానికి పిఎసిఎస్‌ మాజీ చైర్మన్‌ రొంగలి కనక సింహాచలం పూలమాలవేసి నివాళులర్పించారు. వేపాడ: మండలంలోని సోంపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా స్కౌట్‌ యూనిట్‌, రుద్రమదేవి గైడ్‌యూనిట్‌ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిపిఎ రాజు, స్కౌట్‌ మాస్టర్‌ పి.రమేష్‌, ఏ రవిశంకర్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.నెల్లిమర్ల: స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ బంగారు సరోజినీ, కమిషనర్‌ కె. అప్పల రాజు గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. డైట్‌లో ఇంఛార్జి ప్రిన్సిపాల్‌ ఎన్‌. తిరుపతి నాయుడు, అధ్యాపకులు మతా రామకృష్ణ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ ఎంవి రమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డి.ఉమా భాస్కర్‌, సిబ్బంది పాల్గొన్నారు.సంతకవిటి: మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ సిరిపురం జగన్మోహన్‌ రావు పూల మాలల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపిడిఒ కార్యాలయం ఎదుట స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండలంలో పనిచేస్తున్న గ్రీన్‌ అంబసీడర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సిరిపరపు మంజు, ఎఒ రఘునాథచారి, ఎస్‌ఐ గోపాల్‌రావు, ఇఒపిఆర్‌డి పుష్పాంజలి, మండల అధికారులు పాల్గొన్నారు.రామభద్రపురం: స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహనికి ఘన నివాళులు అర్పించారు. నాయుడు వలస పాఠశాలలో హెచ్‌ఎం జెసి రాజు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు.బొండపల్లి: మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి చల్ల చలం నాయుడు, ఎంపిడిఒ వైవి.రాజేంద్రప్రసాద్‌లు మహాత్ముని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది గాంధీ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఎం.కొత్తవలస, కెరటాం, చినతమ రాపల్లి, బొండపల్లి, బి.రాజేరు, నెలివాడ, బిల్లలవలస, ముద్దూరు, పంచాయతీలలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.విజయనగరం: స్థానిక గురజాడ పాఠశాలలో గాంధీ జయంతిని పురష్కరించుకుని ఆయన చిత్రపటానికి పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంవిఆర్‌ కృష్ణాజీ, కరస్పాండెంట్‌ స్వరూప, ప్రధానోపాధ్యాయులు పూడి శేఖర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు గాంధీజి గొప్పతనం గురించి వివరించారు.గంట్యాడ: గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రిల జయంతిని పురష్కరించుకుని మండలంలోని పెదమజ్జిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాద్యాయులు గింజేరు గ్రామానికి వెళ్లే రహదారిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కె.సునీత, ఉపాధ్యాయులు దుర్గయ్య, రాంబాబు, తిరుపతి రావు, సురేష్‌ కుమార్‌, అప్పలస్వామి, నాగేశ్వర రావు, శివకు మార్‌, దేవుడమ్మ, శ్రీదేవి, కుమారి, పార్వతీ, సీతామహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.విజయనగరంటౌన్‌ : జనసేనపార్టీ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రిల జయంతిని ఘణంగా నిర్వహించారు. జనసేన నాయకులు గురాన అయ్యలు, అవనాపు విక్రమ్‌,అవనాపు భావన కాళ్ల గౌరీ శంకర్‌ మహాత్మా గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని పిలుపునిచ్చారు.సత్య కళాశాలలో : సత్య డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. కళాశాల సంచాలకులు డాక్టర్‌ ఎం శశి భూషణ రావు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం వి సాయి దేవ మణి, ఎన్‌ సి సి ఆఫీసర్‌ కెప్టెన్‌ ఎం సత్య వేణి, అధ్యాపకులు గాంధీచిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ చిత్ర పటానికి జెఎన్‌టియు ఇంచార్జి వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌. డి. రాజ్యలక్ష్మి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పాల్గొన్నారు.గాంధీ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యేపూసపాటిరేగ : గాంధీ జయంతి సందర్బంగా పూసపాటిరేగలో శ్రీసూర్యోధయ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో పూసపాటిరేగ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే లోకం నాగమాధవి బుధవారం ఆవిష్కరిచారు. ఈ సందర్బంగా తమకు ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, కన్యాకాపరమేశ్వరి ఆలయం నిర్మాణానికి స్ధలం కావాలని కోరారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షలు జలపారి శివ, మండల కోఆర్డి నేటర్‌ జి. జమరాజు, నాయకులు బాలా అప్పలరాజు, శంకాబత్తుల సత్తిబాబు, కళాశాల డైరెక్టర్‌ బి. చంధ్రశేఖర్‌, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షలు బలభద్రుని శ్రీను, ఉపాధ్యాక్షలు ఆకి తాతాజీ, కార్యదర్శి పూసర్ల మురళీ, తదితరులు పాల్గొన్నారు.. విజయనగరం కోట : కొత్తగ్రహారంలో గల రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్‌ అకాడమీలో మహాత్మ గాందీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతులు జరిగాయి. రోటరీ ద్వారం నరసింగరావు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అధ్యక్షులు ఉసిరికల చంద్రశేఖర్‌ రావు, అకాడమీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మండపాక రవి, మహాత్మ గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాల్‌ బహు దూర్‌ శాస్త్రి 120 జయంతిని బుధవారం అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద గల ప్రజా గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టివి. దుర్గారావు బహూదర్‌ శాస్త్రి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ది వేదిక నాయకులు పి. షణ్ముఖరావు, ఇఎస్‌ఎన్‌ రాజు, ఆలమూరు శ్రీను, బెల్లాపు బాబ్జీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️