ప్రజాశక్తి – నెల్లిమర్ల : నగర పంచాయతీలో జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు. 19వ వార్డులో వికలాంగుడైన బైరెడ్డి సూరిబాబుకు రూ.6 వేలు, జామి సన్యాసి రావుకు వృధ్యాప్య పింఛను పాత బకాయితో కలిపి రూ.8 వేలు, వి.లక్ష్మీకి రూ4వేలు పింఛను సొమ్మును మంత్రి చేతులు మీదుగా అందించారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందే పింఛన్ పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్‌పి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్కెఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగార్రాజు, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా పరిషత్ సిఇఒ సత్యనారాయణ, డిఆర్‌డిఎ పీడీ కల్యాణ చక్రవర్తి, టిడిపి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున, టిడిపి నాయకులు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్‌రావు, సువ్వాడ రవి శేఖర్, సువ్వాడ వనజాక్షి, టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు, పతివాడ అప్పలనారాయణ, ఆకిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.బాడంగి: మండలంలోని మల్లంపేటలో శనివారం బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు వృద్ధులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఎరుకుల పాకలో ఎంపిటిసి పాలవలస గౌరు, సర్పంచ్ పార్వతి పింఛన్ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో టిడిపి మండల నాయకులు తెంటు రవిబాబు, వైస్ ఎంపిపి ఎస్.భాస్కర్ రావు, నాయకులు తెంటు కన్నంనాయుడు, బొంతు త్రినాధ్, సత్యం నాయుడు, సర్పంచ్ పద్మ నాయకులు పాల్గొన్నారు.తెర్లాం: మండలంలోని కుసుమూరు, నందబనగా గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే బేబినాయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హేమంత్ కుమార్, ఎంపిడిఒ ఆర్ రాంబాబు, టిడిపి నాయకులు ఎన్ వెంకట్‌నాయుడు, వెంకటేశ్వరరావు, యుగంధర్, ఆర్.శంకర్ రావు పాల్గొన్నారు.గుర్ల: మండలంలోని పెదబంటుపల్లి, రౌతుపేట, లవిడాం, తదితర గ్రామాలలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్‌నాయుడు చేతులు మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బిసి సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్నె సన్యాసి నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు చనుమల మహేశ్, కూటమి శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.