ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి ఆదర్శ రైల్వేస్టేషన్ పనులు వేగవంతం చేయాలని రైల్వే డిఆర్‌ఎం మనోజ్ కుమార్ సాహు కోరారు. స్థానిక రైల్వే స్టేషన్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. నూతన భవనం, ఆదర్శ రైల్వేస్టేషన్ పనులు, ప్లాట్ ఫామ్‌పై తాగునీటి సౌకర్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడో లైన్ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈనెల 15న రైల్వే జిఎం రైల్వే స్టేషన్‌కు వస్తారని చెప్పారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయనతో రైల్వే అధికారులు ఉన్నారు.
