రిజర్వ్‌ స్థలం అమ్మకంపై దర్యాప్తు

Jan 9,2025 21:08

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి-పార్వతీపురం రోడ్డులో స్పైసి దాబాకు ఎదురుగా ఉన్న లే అవుట్లో రిజర్వ్‌ స్థలాన్ని విక్రయించడంతో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, టిపిఒ రేవతి, మున్సిపల్‌ ఆర్‌ఐ సురేష్‌ గురువారం పరిశీలించారు. రిజర్వ్‌ స్థలాన్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజర్వ్‌ స్థలం ప్రజా అవసరాలకు ఉపయోగ పడేలా చూడాలన్నారు. రిజర్వ్‌ స్థలాన్ని అమ్మిన వారికి, కొనుగోలు చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని టిపిఒను ఆదేశించారు.

➡️