ఫీజు పోరుపేరుతో జగన్ ధర్నాకు పిలుపునివ్వడం సిగ్గుచేటు 

Feb 1,2025 13:00 #Vizianagaram district

ప్రజాశక్తి-విజయనగరం కోట : గత వైకాపా ప్రభుత్వంలో 2000 కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టి, విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసిన ఘనత జగన్ దే టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెవర భరత అన్నారు. శనివారం నాడు టిడిపి కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలకే 788 కోట్లు విడుదల చేసి,9 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చిన ఘనత. మంత్రి నారా లోకేష్ దే అన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో విడుదలవారీగా తొమ్మిది లక్షల మందికే ఫీజు రీయింబర్స్మెంట్, ఫలితంగా అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. జగన్ ఉనికి కోసమే ఫీజు పోరు కార్యక్రమన్నారు. జగన్ ఫీజు పోరు రోడ్డుపై కొచ్చి దొంగ నాటకాలు ఆడితే విద్యార్థులు తరిమికొట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గెదెల సతీష్, TNSF నాయకులు మైలపిల్లి వాసు, కోరాడ రామకృష్ణ, సుధీర్, విజయ్, మన్మథ్, ప్రసాద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

➡️