ఉద్యోగ భద్రత కల్పించాలి

Sep 30,2024 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ఎపి బేవరేజ్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద మద్యం షాపుల సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి నాయకులు ఎస్‌.రామకృష్ణ, అర్‌.సాయికుమార్‌, కె.మురళీ, ఎస్‌ చిరంజీవి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీతో రాష్ట్రంలో 15వేల మంది రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 7న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. ధర్నాకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరామమ్మ మద్దతు తెలిపారు. ధర్నాలో సిఐటియు నాయకులు ఎ.జగన్మోహనరావు, మద్యం షాపులు ఉద్యోగులు పాల్గొన్నారు. రామభద్రపురం : మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని మద్యం షాపు వర్కర్లు డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, సేల్స్‌మేన్‌లు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️