ప్రభుత్వ మద్యం షాపుల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

Sep 30,2024 12:33 #Vizianagaram district

జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా
మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
సి ఐ టి యు రాష్ర్ట ఉపాధ్యక్షులు సుబ్బరామమ్మ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మాకు ఉద్యోగ భద్రత కల్పించి, మాకు మా కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఎపి బెవారేజ్ కార్పొరేషన్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి నాయకులు ఎస్.రామకృష్ణ,అర్ సాయికుమార్, కే మురళీ,ఎస్ చిరంజీవి మాట్లాడుతూ అక్టోబర్ 01 తేది నుండి నూతన మద్యం పాలసీ( ప్రైవేటీకరణ) అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. అదే కనుక నిజమైతే 15000 మంది నిరుద్యోగులమైన మాపై ఆధారపడ్డ మాకుటుంబాలు కూడా రొడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3600 ప్రభుత్వ మద్యం షాపులను ఏర్పాటుచేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజష్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందన్నారు. ఆ ఎంపిక ప్రక్రియ మెత్తం స్థానిక ( జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎక్సైజ్ సూపరిడెంట్ ) వారి సమక్షంలో ఇంటర్వూ, సర్టిఫికేట్ వేరిఫికేషన్ చేసి ఔట్ సోర్సింగ్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 15000 మందిని ఎంపిక చేసారన్నారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా సూపర్వైజర్లు -170, సేల్స్ మ్యాన్లు- 420, డిపో ఫరిదిలో 11, సేక్యూరీటి గార్డులు -330 విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2020-2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకోని మాప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడి పనిచేసామన్నారు. కానీ 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రం మెత్తం అక్టోబర్ 01 తేది నుండి నూతన మద్యం పాలసీ ((ప్రైవేటీకరణ) అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. దానిపై స్పష్టత తెలియజేయాలని ముఖ్యమంత్రినీ, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి వర్యులు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులుకు, రాష్ట్ర విధానసభ సభ్యులుకు, స్థానిక జిల్లా కలెక్టర్కి మరియు జిల్లావారిగా డిపో మేనేజర్ కీ ఇప్పటికే ప్రాంతాలవారిగా వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందన్నారు. అయినప్పటికీ ఎవ్వరి దగ్గర నుంచి ఎటువంటి సమాదానం రాలేదన్నారు.అందువలన రాష్ట్ర యూనియన్ తేది: 07/09/2024 రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపును ఇచ్చింది. దానిపై వివరణ కొరకు రాష్ట్ర యూనియన్కు ఎం డి నుంచి జిల్లా కమిటీ సభ్యులుకు డిపో మేనేజర్ నుంచి చర్చలకు పిలుపునిచ్చారు. విజయవాడలో బుడమేరు వలన కలిగిన నష్టంవలన మేము రాష్ట్ర అధికారులకు మరియు రాష్ట్ర ప్రభుత్వంకు ఇబ్బంది కలిగించకూడదు.
అనే ఉద్దేశ్యంతో బంద్ ను విరమించుకున్నామన్నారు. అందువలన ఎం డి గారు చర్చలు నిమిత్తం తేది: 15/09/2024 నుంచి 20/09/2024 వరకు సమయం అడిగారు. దీనిపై నేను పైఅధికారులతో చర్చించి మీకు వివరణ తెలియజేయడానికి మూడు రోజులు సమయం అడిగారు. ఆర్యోగంసరిగ్గా లేదని చెప్పి నేటి వరకు చర్చలు జరపకోవడం అన్యాయమన్నారు.
దీనితో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తిరుపై దిగ్భ్రా భ్రాంతికు గురైన సిబ్బంది రాష్ట్ర యూనియన్ అంగీకరంతో విజయనగరం జిల్లాలో ఉన్న 170 షాపుల సిబ్బంది మూకుమ్మడి రాజీనామా చేయదలుచుకున్నారు. రాజీనామాను జిల్లా అధికారులు అంగీకరించకపో నడంతో ప్రభుత్వ మద్యంషాపుల సిబ్బంది ఈ రోజు నుంచి విధులకు హాజరు కాకుండా షాపులు బంద్ పాటించడం జరిగిందన్నారు. ఈ రాష్ట్ర పౌరులగా రాష్ట్రప్రభుత్వం తీసుకొనే నిర్ణయం ఏదైన మేము గౌరవిస్తున్నాము. కానీ ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం మాకు ఎటువంటి వివరణ ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.
మాకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం ధర్నా వద్దకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సుబ్బరామమ్మ ధర్నా లో పాల్గొని మద్దతు తెలిపారు.మీరు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సి ఐ టి యు అండగా ఉంటుందని న్యాయం జరిగే వరకు,ఉద్యోగ భద్రత సాధించుకునే వరకు పోరాటంలో అండగా ఉంటామన్నారు. ధర్నా లో సి ఐ టి యు నాయకులు ఏ.జగన్మోహనరావు, మద్యం షాపులు ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️