ప్రజాశక్తి – నెల్లిమర్ల : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కెజిబివి విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ బి. ఉమా మంగళవారం తెలిపారు. ఈ నెల 15,16న తేదిలలో జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో పోటీలకు జిల్లా నుంచి మహిళల విభాగంలో కెజిబివి పాఠశాలకు చెందిన జె. కావ్య, పి.పావని, పి.జ్యోత్స్న రాణి, ఎస్. డిల్లిశ్వరి, కె.భార్గవి, బి.దీపిక, సత్య, అనూష, జయలక్ష్మి ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్బంగా వారిని ప్రిన్సిపాల్‌తో పాటు పిఇఒ రమణి అభినందించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మోహనరావురాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జరజాపుపేట ఉన్నత పాఠశాలకు చెందిన మద్దిల మోహనరావు ఎంపికైనట్లు పిఇటి ఎన్.సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 14 నుంచి 16 వరకు కడప జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల ఛాంపియన్ షిప్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థినిని హెచ్‌ఎం ఆర్. ఆదినారాయణ, సిబ్బంది, గ్రామ పెద్దలు అభినందించారు.
