11న ముగడలో కోలాటం, నృత్యం పోటీలు

Nov 5,2024 20:41

ప్రజాశక్తి- బొబ్బిలి : బాలల దినోత్సవం సందర్భంగా ఈనెల 11న బాడంగి మండలం ముగడ గ్రామంలో కోలాటం, నృత్యం పోటీలు నిర్వహించనున్నట్లు కారుణ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జెసి రాజు, బొబ్బిలి మల్టీ టాలెంట్‌ గ్రూపు సంస్థ అధ్యక్షులు జి.కరుణకుమార్‌, కొరియోగ్రాఫర్‌ చిన్నికృష్ణ తెలిపారు. పోటీలకు సంబంధించిన గోడ పత్రికలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు కోలాటం, డాన్స్‌ పోటీలు నిర్వహిస్తున్నామని, బాల, బాలికలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ముగడలో ఉదయం 7.30గంటల నుంచి 11.30గంటల వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరు కావాలని కోరారు. ప్రతిభ కనబరిచిన 10 టీములను ఎంపిక చేసి ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు, బహుమతులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్‌ అప్పులనాయుడు, పి.నాగరాజు, టి.వెంకటరమణ, ఎం.గౌరినాయుడు, డిజె దామోదర్‌, రాముద్రి గంగాధర్‌, సభ్యులు పాల్గొన్నారు.

➡️