ప్రజాశక్తి- మెంటాడ : మత సామరస్యాన్ని కలిసికట్టుగా కాపాడుకుందామని సిపిఎం మండల కార్యదర్శి రాకోటి రాములు కోరారు. సిపిఎం ప్రచార కార్యక్రమాన్ని బుధవారం లోతు గెడ్డ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాకోటి రాములు మాట్లాడుతూ దేశానికి మతోన్మాద ప్రమాదం పెరుగుతుందన్నారు. మెజారిటీ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మైనారిటీలపై దాడి చేసి మత ఐక్యతకు దెబ్బతీసి ప్రజలను చీల్చి బిజెపి పాలన సాగించాలని నిర్ణయానికి వచ్చిందన్నారు. మతోన్మాద గొడవలను ఆసరాగా తీసుకుని ప్రజలను అనైక్యతవైపు నెట్టివేస్తూ క్రమక్రమంగా ఈ గందరగోళంలో భారత దేశ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించే కుట్రకు పూనుకుం టుందన్నారు. అందుకనే భారత దేశ స్వాతంత్రో ద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ వారికి సహకరించిన ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తుందన్నారు. మనుధర్మ శాస్త్ర రాజ్యాంగాన్ని అమలు చేయాలని అనేక ఏళ్లుగా తహతలాడుతుందన్నారు. ఇందులో భాగంగానే అంబేద్కర్‌ని అవమానించడం గిరిజనుల ప్రత్యేక హక్కులను 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని గత 20 ఏళ్లుగా బిజెపి చూస్తోందన్నారు. ప్రజలను ఐక్యం చేసి మతసామరస్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను దృష్టిలో పెట్టుకొని మతవిద్వేషాలకు వ్యతిరేకంగా నిలబ డాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ కృష్ణవేణి, రమేష్, చిన్నమ్మలు, బంగారు సింహాచలం, ఆర్ కృష్ణవేణి పాల్గొన్నారు.