ప్రజాశక్తి – విజయనగరంకోట : 2030 నాటికి విజయనగరం జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా తీర్చి దిద్దడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు పిలుపునిచ్చారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పీడీ బి.శాంతి కుమారి ఆధ్వర్యాన వెబ్ కాస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎపిడి విజరు కుమారి, యూత్ క్లబ్ బెజ్జిపురం ఎన్‌జిఒ డైరెక్టర్ ఎం. ప్రసాద్‌రావు, ఎన్‌జిఒ ప్రతినిధి జి.అప్పలనాయుడు, సిడిపిఒ ప్రసన్న, డిసిపిఒ వై.నాగరాజు, ప్రాజెక్టు సిబ్బందతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ కంటోన్మెంట్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కేసలి అప్పారావు పాల్గొన్నారు. జామి: బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మారాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు పిలుపు నిచ్చారు. బుధవారం కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థినులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులందరికీ సాలూరు పట్టణానికి చెందిన అమెరికన్ ఎన్నారై యామలపల్లి యుగంధర్ అందజేసిన స్వెట్టర్స్ ను డిఇఒ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకడమిక్ మోనెటరింగ్ టీం సభ్యులు, మండల విద్యాశాఖ అధికారి గంగరాజు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.వేపాడ: బాల్య వివాహాలను నివారించేందుకు ప్రధానంగా తల్లిదండ్రులు, ఐసిడిఎస్ సిబ్బంది, పోలీసు శాఖ గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఎంపిడిఒ సిహెచ్ సూర్యనారాయణ సూచించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయం వద్ద ఉద్యోగులకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు ప్రోత్సహించడం నేరమంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాములమ్మ, ఎస్‌ఐ బి. దేవి, ఎంఇఒ పి. బాల భాస్కరరావు, ఎపిఒ ఆదిలక్ష్మి, అంగన్వాడి సూపర్‌వైజర్ భాగ్యవతి, సిహెచ్‌ఒ ఆంజనేయులు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్త్ వర్కర్స్, సచివాలయ మహిళా రక్షకులు తదితరులు పాల్గొన్నారు.డెంకాడ: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఎస్‌ఐ ఎ. సన్యాసినాయుడు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బెజ్జిపురం యూత్ క్లబ్ ఎన్‌జిఒ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జిఒ డైరెక్టర్ ఎం ప్రసాదరావు, శ్రీనివాసరావు, ఎంఇఒ-2 రమణ, యూత్ క్లబ్ బ్రిడ్జిపురం సంస్థ ప్రతినిధులు శివశంకర్, శ్రీనివాస్, ఝాన్సీ రాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యద ర్శులు, ఎఎన్‌ఎంలు, మహిళా పోలీసులు, పాల్గొన్నారు.మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బాల్యవివాహాలపై ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.రాజాం : స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ముక్తభారత్ కార్యక్రమం చేపట్టారు. ఎంపిడిఒ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలని, ఆశా వర్కర్స్, కార్యాలయ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. కొత్తవలస: కొత్తవలస స్థానిక న్యాయస్థానం జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ సముద్రాల విజయచందర్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చనుందని దానికి అనుగుణంగా పాఠశాల విద్యార్థులచే ప్రతిజ్ఞచేయించారు. బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీపురుపల్లి ఈశ్వరరావు, ఉపాధ్యాయులు, జిల్లా, కొత్తవలస న్యాయవాదులు పాల్గొన్నారు.రాజాం: బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని జూనియర్ సివిల్ జడ్జి విఎస్‌విబి కృష్ణ సాయి తేజ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వివాహ వయసు పట్ల అవగాహన బాలల సంరక్షణ కోసం స్నేహపూరక న్యాయ సేవల పథకం, ఉచిత న్యాయ సహాయం, లీగల్ సెల్ అథారిటీ చట్టం, తదితర వాటిపై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. బాల్య వివాహాలు చేసినవారు, వివాహం చేసుకు న్నవారు, ప్రోత్సహించిన వారు అందరూ శిక్షార్హుల న్నారు. ఈ సదస్సులో న్యాయవాదులు ఆర్. విజరు కుమార్, ఎం. శ్రీనివాసరావు, రాజం టౌన్ సిఐ కె. అశోక్ కుమార్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.నాగయ్య, ఉపాధ్యాయులు, టౌన్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.