ప్రజాశక్తి – బొబ్బిలి : ఎమ్మెల్యే బేబినాయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విస్తృత పర్యటన చేశారు. తెర్లాం మండలంలోని పెరుమాళి గ్రామంలో చెగుడువీధి ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని వెంటనే తన సొంత నిధులతో బోరు తీయించి, మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేయించారు. ఆయన చేతుల మీదుగా మంచినీటి ట్యాంకును ప్రారంభించారు. పూలువలస గ్రామంలో కోదండ రామ ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డి గదభవలసలో సిమెంట్ బ్రిక్ మిషన్ ప్రారంభించారు. సుందరాడ గ్రామంలో దాకారపు వెంకన్న కుమారుడు మరణించిన విషయం తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ నర్సుపల్లి వెంకట్ నాయుడు, మాజీ ఎంపిపి నర్సుపల్లి వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి ఎం.తేజోవతి, పెరుమాళి నాయకుల అప్పచురాజు, మాజీ ఎంపిటిసి జగ్గరాజు, మర్రాపు శంకర్రావు, నాయకులు, పాల్గొన్నారు.అయోధ్య రామమందిరానికి బొబ్బిలి వీణఅయోధ్య రామమందిరానికి బొబ్బిలి వీణ పంపించనున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. అయోధ్య కోసం తయారు చేస్తున్న వీణను బుధవారం ఆయన పరిశీలించారు. బొబ్బిలి వీణ ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు అయోధ్యకు పంపిస్తున్నామని చెప్పారు. గొల్లపల్లి గ్రామదేవత పండగ లోగా వీణ తయారు చేసి ఇస్తామని కళాకారులు చెప్పగా వీణ ఇచ్చిన వెంటనే అయోధ్య పంపిస్తామని బేబినాయన అన్నారు.
