ప్రజాశక్తి – నెల్లిమర్ల : విద్యార్థి దశ నుంచి కళలపై అవగాహన ఉండాలని డైట్ ప్రిన్సిపాల్ జి. పగడాలమ్మ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ (డైట్)లో జిల్లా స్థాయి బాల రంగ్ సంప్రదాయ జానపద నృత్య పోటీలు జరిగాయి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యతో బాటు సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి కళలను పాఠశాల దశ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన జిల్లా జానపద నృత్యం, సంగీతానికి మంచి పేరు ఉందని ఆ దిశగా ప్రావీణ్యం సంపాదించాలని కోరారు. అనంతరం జిల్లా స్థాయిలో మొయిద జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు కర్ర సాములో ప్రథమ స్థానం సాధించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె. రామకృష్ణారావు, కోఆర్డినేటర్ పి.రవికుమార్, అధ్యాపకులు డి. ఈశ్వర రావు, మాతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.