విధుల్లో అలసత్వం వద్దు : ఎస్‌పి

May 12,2024 21:13

నెల్లిమర్ల : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. విధుల్లో అలసత్వం వద్దని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆదివారం పోలీసు అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పోలింగు కేంద్రాలు వద్ద, రూట్‌ మొబైల్స్‌ నిర్వహించాల్సిన బందోబస్తు విధులు, భద్రత గురించి నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో దిశా నిర్దేశం చేశారు ఎన్నికల విధుల్లో ఎటువంటి అలసత్వం వద్దని, పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించాలని, 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా ఇంకెవ్వరూ ఉండకుండా చూడాలని, 200 మీటర్లు దూరంలోనే ఓటర్ల వాహనాలను నిలిపి వేయాలని, ప్రశాంతయతంగా ఎన్నికల నిర్వహణకు కృతనిశ్చయంతో పని చేయాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సంబధిత అధికారులకు సమాచారం అందించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో భోగాపురం సిఐలు వెంకటేశ్వరరావు, రవికుమార్‌, పలువురు ఎస్సైలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కొటియా ఓటర్లపై గురికిందకు దించేందుకు సన్నాహాలు ప్రజాశక్తి – సాలూరువివాదాస్పద కొటియా గ్రామాలకు సంబంధించిన ఓటర్లపై అధికారపార్టీ నాయకులు గురి పెట్టారు. శిఖపరువు, నేరళ్లవలస పోలింగ్‌ కేంద్రాలకు రావాల్సిన ఓటర్లను కొండలపై నుంచి కిందకు దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టుచెన్నూరు, పగులచెన్నూరు గ్రామాలకు చెందిన గిరిజన ఓటర్లు శిఖపరువు పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. పట్టు చెన్నూరులో ఒడిశా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ఓటు వేసి గిరిజన ఓటర్లు శిఖపరువులో ఓటు వేయడానికి వీలుపడదు. దీంతో పట్టు చెన్నూరు, పగుల చెన్నూరు గ్రామాల ఓటర్లను శిఖపరువు పోలింగ్‌ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు తరలించారు. అలాగే కొటియా, ఎగువశెంబి, దిగువ శెంబి, గంజాయి భద్ర, దూళిభద్ర గ్రామాల ఓటర్లను నేరెళ్లవలస పోలింగ్‌ కేంద్రం వద్దకు దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొటియా గ్రామాల ఓటర్లతో ముందు ఎపి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయించేలా అధికారపార్టీ నాయకులు ప్రయత్నించారు. 21 కొటియా గ్రామాలకు చెందిన మొత్తం 2500 ఓట్లలో అధికశాతం ఓట్లు పోలింగ్‌ చేయించే ప్రయత్నం లో వున్నారు.ఆర్‌ఎంపిలు ఓటు హక్కును వినియోగించుకోవాలిప్రజాశక్తి-విజయనగరం సార్వత్రిక ఎన్నికలలో గ్రామీణ వైద్యులంతా పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు గెద్ద చిరంజీవి ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన మహోన్నతమైన ఓటు హక్కును వినియోగించుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత మూలమైన ప్రభుత్వాలను ఎంపిక చేసుకొని బాధ్యతను రాజ్యాంగం ఓటు హక్కు ద్వారా మనకు కల్పించినందున, ఆర్‌ఎంపి వైద్యులంతా కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రకటనలో కోరారు.

➡️