సందడిగా సిరిమాను చెట్టు తరలింపు

Sep 28,2024 21:52

ప్రజాశక్తి-డెంకాడ : పైడితల్లమ్మ సినిమాను చెట్టును శనివారం తరలించారు. మండలంలోని పెదతాడివాడ గ్రామంలో ఎం.అప్పారావు కళ్లంలో సిరిమాను చెట్టుకు పూజారి బంటుపల్లి వెంకటరావు, దేవాలయ సిబ్బంది తొలుత పూజలు నిర్వహించారు. అనంతరం మూడుసార్లు గాట్లు పెట్టి చెట్లు కొట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ప్రత్యేకంగా తయారు చేసిన ఎడ్ల బండిపై విజయనగరంలోని హుకుంపేటలో ఉన్న సినిమాను పూజారి ఇంటికి చేర్చారు. పైడితల్లమ్మ ఆలయ ఇఒ డివివి ప్రసాదరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది. సినిమాను చెట్టుకు జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్‌పి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, అదితి గజపతిరాజు, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, మాజీ ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖరరావు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపిపి బి.వెంకట్‌ వాసుదేవరావు, మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర రావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు పతివాడ అప్పలనారాయణ, తహశీల్దార్‌ వి.పద్మావతి సినిమాను చెట్టుకు పూజలు నిర్వహించారు. చెట్టుకు మూడుసార్లు గొడ్డలితో గాట్లు పెట్టారు. డిఎస్‌పి శ్రీనివాసరావు బందోబస్తును పర్యవేక్షించారు. భోగాపురం సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️