అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలు మృతి

ప్రజాశక్తి-రామభద్రపురం : విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని కొట్టక్కి గ్రామంలో దండు సింహాచలం(75) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. డబ్బులు కోసమే దుండగులు హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల గ్రామంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వివిధ షాపుల్లో చోరీలు జరిగాయి. ఈ క్రమంలో అదే తరహాలో వంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంటికి దొంగతనానికి వెళ్లి హతమార్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరరించారని స్థానికులు తెలుపుతున్నారు. పండగకి రాలేదు అని చూసేందుకు దూరపు బంధువు రావడంతో దారుణం వెలుగు చూసింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

➡️