పైడితల్లమ్మ హుండీ ఆదాయం రూ.10 లక్షలు

Oct 3,2024 21:25

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పైడితల్లి అమ్మవారి హుండా ఆదాయం గత 29 రోజులకు గాను రూ.10, 54, 690 , బంగారం 12 గ్రాముల 100 మిల్లా గ్రాములు వచ్చింది. గురువారం హుండీని లెక్చించారు. వీటితో పాటు వెండి 131గ్రాములు వచ్చినట్లు ఇఒ ప్రసాదరావు తెలిపారు. రామతీర్థం ఆలయ సహయ కమిషనర్‌, పోలీసు సిబ్బంది సమక్షంలో హుండీని లెక్కించారు. హుండీలో చెల్లని నోట్లుహుండీ లెక్కింపులో పాత 2వేల రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, నకిలీ రోల్డ్‌ గోల్డ్‌ దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా ఆలయ ఇఒ ప్రసాద్‌ రావు మాట్లాడుతూ హుండీలో ఇలాంటి నోట్లు భక్తులు వేయకూడదని సూచించారు.

➡️