రాష్ట్రంలో లో ఉపాధి వామి చట్టం అపహాస్యం
ప్రతక్ష పోరాటంతో పాటు న్యాయపోరాటానికి సిద్దం
లోకల్ గవర్నమెంటు, బాంబర్ జాతీయ· అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 2005 మూతాది గాంధీ జాతీయ ఉపాది హామీ చట్టం, నేడు మన రాష్ట ప్రభుత్వం అపహశ్యం.. చేస్తోందని లోకల్ గనర్వ మెంట్లు చాంబర్ జాతీయ అధ్యక్షులు మామిడి అప్పునాయుడు ఆవేదన వ్యక్తం చేసారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యనికి పునాదులు దేశాభివృద్ధికి , అభివృద్ధి కోసం చేసిన 73వ రాజ్యాంగ సవరణ 1994 పంచాయితి రాజ్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణం డిమాండ్లు పరిష్కారం చేయకుంటే ‘పత్యక్ష ఆందళనలతో పాటు న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ చట్టం చట్టం2005 షెడ్యూల్ 1, పార్టీ (4) ప్రకారం గ్రామ అవసరాలకు అనుగుణంగా, పనులు గుర్తించి. అక్కడ ప్రజల అవసరాలకు తగ్గట్టు గ్రామసభల్లోనే నిర్ణయించాలన్నారు. గ్రామ సభల్లో ఆమొదించిన పనులు ఆ ప్రాధాన్యత వరసలోనే జిల్లా కలక్టరు మంజూరు చేయాలన్నారు.
మండల జిల్లా పరిషత్ లు నిర్వర్యం సర్కిల్ 1926/ 2024 కమీషనర్ పి అర్, అర్ డి ఉత్తర్వుల ప్రకారం గ్రామ సభలో గుర్తించిన పనులు పరిసిలించి మండలు పరిషతలు ఆమోదించాలన్నారు. 2004- 2005, 7:1-7 ప్రకారం సర్కిలర్ ప్రకారం మెటిరియల్స్, స్కిల్డ్ సెమిస్కిల్డ్ లేబర్ సరఫరా కోసం ప్రభుత్వం లైసెన్సుతో పాటు ప్రస్తుతం వ్యాపారం చేసుకునేవారిని మాత్రమే మండల పరిషత్ ఎం పి డి ఓ ఎంపిక చేసి అనుమతి ఇవ్వాలన్నారు. మరో వైపు టెండర్లు పిలిచి అనుమతి పొందిన చేసిన వెండర్స్ మెటిరియల్స్, స్కిల్ సెమీస్కిల్డ్ లేబర్ ను సరసరా చేయాలన్నారు. కాని అధికార పార్టీ కార్యకర్తలను వెండర్లు అప్రూవల్ చేసి వారు కాంట్రాక్టుర్లుతో లాలుచీ ఒప్పుందాలు చేసుకొని మోసం చేస్తున్నారన్నారు. ఎన్ ఆర్ జి ఎస్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు.
ఎన్ ఆర్ జి ఎస్ చట్టంలో అభివృద్ది పనులు ‘పంచాయితీ రాజ్ వ్యవస్థలు గ్రామపంచాయితీ, మండల పరిషత్ ద్వారా అమలు చేయాలి కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసులతో అధికార పార్టీ కార్యక్తలుకు పనులు అప్పగిస్తూ వారి ద్వారా కాంట్రాక్టర్లు చీకటి ఒప్పందాలు చేసుకొని ఉపాధి నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. వెంటనే బాద్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరారు. సంబందిత ఉద్యోగులను విధులనుండి తొలగించాలని ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించని పక్షంలో నవంబర్ 29 , 2024 నుండి ప్రత్యక్ష పోరాటంతోపాటు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లియక తప్పదని హెచ్చరించారు.
దీని కోసం 29న , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా కలెక్టర్ కి వినత పత్రాలు, 30న సెంట్రల్, స్టేట్ విజలెన్సులకు పిర్యాదు, డిసెంబర్ 1న హైకోర్టు, సుప్రీం కొర్టు ద్వారా న్యాయ పోరాటం డిసెంబర్ 9న ముఖ్యమంత్రి, పంచాయితి రాజ్ శాఖమంత్రి ఇంటిముందు నిరసన, డిసెంబర్ 16న, పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఎంపీటీసీ కెల్ల త్రినాధరావు, కరిమజ్జి రాములప్పడూ సర్పంచ్, ఎంపీటీసీ భోగాపురపు ఆదినారాయణ ఎంపీటీసీ, సర్పంచ్ లు పాల్గొన్నారు.