పార్కింగ్‌ స్థలాలు కేటాయించాలి

Feb 4,2025 21:10

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం కేర్‌ అండ్‌ క్యూర్‌ హాస్పిటల్‌ వద్ద సిఐటియు అనుబంధంగా శ్రీ పైడిమాంబ ఆటో ఆటో స్టాండ్‌ను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నగర అధ్యక్ష కార్యదర్శులు ఎ. జగన్మోహన్‌రావు, బి.రమణ , ఆటో యూనియన్‌ జిల్లా నాయకులు రామనాయుడు ప్రారంభించారు. స్థానిక ఆటో డ్రైవర్‌ కొయ్యన రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లా డుతూ ఆటో, క్యాబ్‌, వ్యాన్‌, లారీ తదితర రవాణా రంగ కార్మికుల సమస్యలపై సిఐటియు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుందన్నారు. సిఐటియు అనుబంధంగా స్టాండ్‌ను ఏర్పాటు చేసుకున్నందుకు డ్రైవర్లను అభినందించారు. సరుకు, ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్లు తీవ్ర అవమానాలకు, వేధింపులకు, దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేస్తూ శిక్షిస్తు న్నారని, పరోక్షంగా డ్రైవర్లపై దాడులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధా నాలు ఉన్నాయన్నారు. ఉబర్‌ ,ఓలా,రాపిడో వంటి కార్పొరేట్‌ సంస్థలకు పార్కింగ్‌ స్థలాలు కేటాయించి ఆహ్వానిస్తున్న ప్రభుత్వాలు స్థానిక ఆటోలకు ఎందుకు పార్కింగ్‌ స్థలాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డ్రైవర్ల అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

➡️