15న పతంజలి పురస్కార సభ

Jun 8,2024 14:24 #Vizianagaram

ప్రముఖ కవి, రచయిత రౌతు బంగారు నాయుడుకు పతాంజలి పురస్కారం 

ప్రజాశక్తి-విజయనగరం కోట : పురస్కార గ్రహీత రౌతు బంగారునాయుడు!! ప్రముఖ రచయిత, సీనియర్ పత్రికా సంపాదకులు దివంగత కె.ఎన్.వై.పతంజలి 72 వ జయంతి సందర్భంగా ప్రతి యేట పతంజలి సాంస్కృతిక వేదిక అందించే రాష్ట్ర స్థాయి పురస్కారం ఈ నెల 15 శనివారం సాయంత్రం ప్రముఖ రచయిత ప్రముఖ ఛానెల్స్ కి కంటెంట్ రైటర్ గా పనిచేస్తున్న రౌతు బంగారునాయుడుకి విజయనగరం జిల్లా గ్రంధాలయం రీడింగ్ హాల్లో అంద చేస్తున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. శనివారం గురజాడ గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రౌతు బంగారునాయుడు పతంజలి లానే సీరియస్ రచనలతో పాటుగా వర్తమాన రాజకీయాల పై కొంటె కోణంలో తన కలం ద్వారా మంచి రచనలు అందించారని అన్నారు. వేదిక కార్యదర్శి ఎన్. కె.బాబు మాట్లాడుతూ బంగారునాయుడు పేరుని పురస్కార కమిటీ ప్రతినిధులు సీనియర్ పాత్రికేయులు వి.ఎమ్.కె.లక్ష్మణరావు, భళ్ళ మూడి నాగేంద్ర ప్రసాద్, శ్రీహరి రాజు ఎంపిక చేశారని గడచిన పది సంవత్సరాలగా పతంజలి పేరున ప్రముఖులకు పురస్కారాలు అందచేస్తున్నామని తెలిపారు. పతంజలి అభిమానులు,సాహిత్య అభిమానులు పురస్కార సభ ని విజయవంతం చెయ్యాలని కోరారు.

రామోజీరావు మృతికి నివాళి..

దేశంలోనే పత్రికా రంగానికి ఒక మార్గం చూపిన ఈనాడు, మార్గదర్శి అదినేత స్వర్గీయ రామోజీరావు మృతి తెలుగు జాతికి తీరని లోటని వ్యాపార రంగాలతో పాటుగా రైతు అభివృద్ధికి ఆయాని చేసిన కృషి మరువలేనిదని భీశెట్టి అన్నారు. రామోజీ మృతికి ఘన నివాళులు అర్పించారు. వేదిక ప్రతినిధులు వి.ఎమ్.కె.లక్ష్మణరావు, జలంత్రి రామచంద్ర రాజు, గురజాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️