ప్రజాశక్తి-నెల్లిమర్ల: నగర పంచాయితీ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక నగర పంచాయితీ కార్యాలయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూల దండ వేసి నివాళి అర్పించారు.అనంతరం దేశ సమగ్రత పై ప్రతిజ్ణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మెన్ సముద్రపు రామారావు,కమిషనర్ కె.అప్పలరాజు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.