రెడ్డికంచేరులో పోలీసు అవుట్‌పోస్ట్‌

Mar 13,2025 20:51

ప్రజాశక్తి-భోగాపురం : మండలంలో రెడ్డికంచేరు గ్రామంలో ఏర్పాటుచేసిన పోలీసు అవుట్‌ పోస్టును గురువారం ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్‌ పోర్టు నిర్మాణ పనులకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వర్కర్లు, స్థానికుల మధ్య విభేదాలు తలెత్తకుండా, పోలీసు సేవలు అందుబాటులో ఉండే విధంగా అవుట్‌ పోస్టు ఏర్పాటు చేశామని చెప్పారు. జిఎంఆర్‌, ఎల్‌అండ్‌టి సంస్థల సహకారంతో పెట్రోలింగ్‌ వాహనం, పోలీసు అవుట్‌ పోస్టు కూడా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిఎంఆర్‌ గ్రూపు వైస్‌ ప్రెసిడెంట్‌ రామరాజు, సిడిఒ ఎం.కోటేశ్వరరావు, డిఎస్‌పి ఎం.శ్రీనివాసరావు, భోగాపురం సిఐ ఎన్‌.వి.ప్రభాకరరావు, ఎస్‌ఐ పాపారావు పాల్గొన్నారు.

➡️